శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (13:16 IST)

రాజస్థాన్‌లో దారుణం.. 25 ఏళ్ళ యువతిపై సామూహిక అత్యాచారం

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ళ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె ప్రతిఘటించబోతే ఆమె శరీరంలోకి బాటిల్ పంపించారు. నాగౌర్ జిల్లా గంగ్వా గ్రామనాకి చెందిన దళిత మహిళ జనవరి 19న పొలానికి వెళ్ళింది.
 
అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రయత్నాన్ని ఆమె అడ్డుకోగా వారు గాజు సీసాను ఆమె సున్నిత భాగాల్లోకి చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన ఎవరికైనా చెప్తే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
 
నిందితుల బెదిరింపులకు భయపడిన మహిళ మొదట ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది. సోమవారం జనవరి 25న పర్బత్ సర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితులైన పంచూరం జాట్, కనారామ్ జాట్, శ్రావన్ గుర్జర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చేపట్టారు.