శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:39 IST)

బీపీ డౌన్... స్పృహతప్పి పడిన భార్య.... ట్రిపుల్ తలాక్ భర్త

నిస్సత్తువ ఆవహించి రక్తపోటు (బీపీ) తగ్గిపోవడంతో ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

నిస్సత్తువ ఆవహించి రక్తపోటు (బీపీ) తగ్గిపోవడంతో ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజ్‌కోట్‌కి చెందిన అఫ్జల్ హుస్సేన్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం రుబీనా అనే యువతితో వివాహమైంది. వారికిప్పుడు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. నాలుగేళ్ల పాటు మంచిగానే ఉన్న భర్త, అత్తమామలు.. క్రమంగా ఆమెపై వేధింపులు మొదలుపెట్టాడు. 
 
దీనికితోడు సరైన ఆహారం లేక ఆమె మహిళ బలహీనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంట్లో పని విషయమై గొడవపడి భార్యను భర్త తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమెకు రక్తపోటు పడిపోవడంతో స్పృతప్పి పడిపోయింది. అదే అదనుగా భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
'నేను తిరిగి స్పృహలోకి వచ్చే సరికల్లా అత్తింటి వారు నన్ను ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్నారు. భర్త నాకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చేశాడంటూ వాదించారు. అప్పడు నేను స్పృహలో లేనని.. భర్త ఏం చెప్పాడో కూడా వినిపించలేదని ఎంత చెప్పినా అంగీకరించలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోమంటూ గెంటేశారు...' అని రుబీనా వెల్లడించింది.