శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (09:58 IST)

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం : పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం...

rajya sabha
దేశ వ్యాప్తంగా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. మొత్తం 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో 56 స్థానాల్లో ఖాళీకానున్నాయి. వీటిలో 41 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 స్థానాల్లో కర్నాటక 4 సీట్లు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక స్థానానికి ఉదయం 9 గంటలకు పోలింగ్ షురూ అయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కౌటింగ్ ప్రక్రియ మొదలుకానుంది.
 
కాగా, ఏకగ్రీవమైన 41 మంది రాజ్యసభ ఎంపీల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్‌తో పాటు పలు పార్టీలకు చెందినవారు ఉన్నారు. బీజేపీ అత్యధికంగా 20 సీట్లు ఏకగ్రీవంగా చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ 6, తృణమూల్ కాంగ్రెస్ 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ 3, ఆర్జేడీ 2, బీజేడీ 2, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీయూ పార్టీలు ఒక్కొక్క స్థానం చొప్పున ఏకగ్రీవం చేసుకున్నాయి. ఆయా స్థానాల్లో ఒకటికి మంచి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో సంబంధింతి అభ్యర్థులను విజేతులుగా రిటర్నింగ్ అదికారులు ప్రకటించిన విషయం తెల్సిందే.