బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (19:44 IST)

వజ్రం లోపల మరో వజ్రం.. బీటింగ్ హార్ట్ అనే పేరు..

Diamond
Diamond
గుజరాత్‌లోని సూరత్ అంటే మేలిమి వజ్రాలకు చిరునామా. సూరత్‌కు చెందని వీడీ గ్లోబల్ అనే సంస్థ వద్దకు అత్యంత అరుదైన వజ్రం చేరింది. వజ్రం లోపల మరో వజ్రం ఉండడంతో దీనికి విశిష్టత ఏర్పడింది. 
 
అంతేకాదు, ఆ వజ్రం లోపల ఖాళీ స్థలంలో ఉన్న చిన్న వజ్రం ఓ గోలీ మాదిరిగా కదులుతుండడంతో ఇదొక విచిత్రమైన వజ్రంగా భావిస్తున్నారు. దీన్ని వీడీ గ్లోబల్ సంస్థ గతేడాది అక్టోబరులో గుర్తించింది. 
 
ఇది 0.329 క్యారెట్ శ్రేణికి చెందిన వజ్రం. ఇలాంటి వజ్రాన్ని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని వీడీ గ్లోబల్ సంస్థ ఛైర్మన్ వల్లభ్ వఘాసియా వెల్లడించారు. దీనికి బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.