అన్ లిమిటెడ్ ఫన్ రాయాలని.. 'అన్ స్టాపబుల్' రాశాను.
Diamond Ratnababu, Bigg Boss Winner VJ Sunny, Saptagiri
బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న చిత్రం 'అన్ స్టాపబుల్'. 'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అన్ స్టాపబుల్' టీజర్, ఫస్ట్ సింగిల్ బుల్ బుల్ అన్ స్టాపబుల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి బేబీ బేబీ సాంగ్ ని విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్ ని ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఫుల్ మాస్ ఎనర్జీ తో కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ మాస్ ని ఆకట్టుకునే లిరిక్స్ అందించగా పుష్ప ఫేం ఇంద్రావతి చౌహాన్ ఈ పాటని హుషారుగా ఆలపించారు.
విజె సన్నీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దిల్ రాజు గారి తర్వాత నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రజిత్ రావు గారు. 'అన్ స్టాపబుల్' ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజ్. చాలా మంచి కథ. ఈ సినిమాతో నిర్మాతకు చాలా మంచి పేరు వస్తుంది. డైమండ్ రత్నబాబు గారు చాలా కష్టపడ్డారు. తప్పకుండా తగిన ఫలితం దక్కుతుంది. సప్తగిరి అన్న అద్భుతమైన టైమింగ్ వున్న నటుడు. ఆయనతో కలసి నటించడం ఆనందంగా వుంది. నక్షత్ర, అక్సా చక్కగా చేశారు. భీమ్స్ అన్న చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రతి సెకన్ ఎంజాయ్ చేశాలా వుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకూ అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ.. 'అన్ స్టాపబుల్' అంటే బాలకృష్ణ గారు గుర్తుకు వస్తారు. ఆయన చేసిన ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ టైటిల్ తో రావడం నిర్మాత రజిత్ రావు, దర్శకుడు డైమండ్ రత్నబాబు, మా అందరి అదృష్టం. సన్నీతో కలసి నటించడం ఆనందంగా వుంది. మా ఇద్దరి టైమింగ్ అదిరిపోయింది ప్రేక్షకులని అన్ స్టాపబుల్ గా కిందపడి నవ్వించే భాద్యత మాది. ఇది మా ప్రామిస్. సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి. అని కోరారు.
నిర్మాత రజిత్ రావు మాట్లాడుతూ, ఒక మంచి సినిమా ఇవ్వాలనే పట్టుదలతో ఈ సినిమా చేశాను. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ది చిన్న సినిమా కాదు అన్నీ వున్న సినిమా. అత్యున్నత సాంకేతికతని వాడాం. ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచిస్తుంది. డబ్బు కోసం ఇండస్ట్రీకి రాలేదు. మంచి సినిమా ఇవ్వాలనే వచ్చాం. డబ్బులు వస్తే మళ్ళీ సినిమా కోసమే ఖర్చుపెడతాం. కుటుంబం అంతా కలసి ఆనందంగా చూసే సినిమా ఇది. సన్నీకి సప్తగిరి ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నన్ను డైమండ్ రత్నబాబు అని పిలిచారు. ఈ సినిమా తర్వాత 'అన్ స్టాపబుల్' డైరెక్టర్ డైమాండ్ రత్నబాబు అని పిలుస్తారని ఆశిస్తున్నాను. చిన్న సినిమాలు తీస్తున్న ప్రతి నిర్మాత నాకు హీరో. మా షూటింగ్ ఒక వార్ లా జరిగింది. వార్ చేయడానికి మా డైరెక్షన్ టీం చాలా సాయం చేశారు. అన్ లిమిటెడ్ ఫన్ రాయాలని.. 'అన్ స్టాపబుల్' రాశాను. ఇందులో ప్రతి పాత్ర ఫన్ తో వుంటుంది. ఈ వేసవిలో మీ అందరినీ నవ్వించాలని ఫిక్స్ అయి వస్తున్నాం. నిర్మాత రజిత్ రావు గారికి ఈ సినిమా హిట్ ని బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం. భీమ్స్, రాహుల్ సిప్లీ గంజ్, కాసర్ల శ్యామ్,ఉద్ధవ్, ఇలా వండర్ ఫుల్ టెక్నిషియన్స్ ఇచ్చిన నిర్మాతకి కృతజ్ఞతలు. సప్తగిరి, సన్నీ పోటిపడి నటించారు. నక్షిత్ర, అక్సా ఖాన్ చక్కగా నటించారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాని థియేటర్ లో చూడాలి అని కోరారు.