ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

బాలయ్య అన్‌స్టాపబుల్‌లో మామా అల్లుళ్లు.. త్వరలోనే టెలికాస్ట్

nbk unstopabble
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తొలి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండో సీజన్‌ కూడా ప్రారంభమైంది. ఇందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బాహుహలి ప్రభాస్ వంటి స్టార్లు హాజరయ్యారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుళ్ళు హాజరుకానున్నారు. 
 
వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇపుడు లీక్ అయ్యాయి. అందులో సాయి ధరమ్ తేజ్ నల్ల షర్టు, తెల్ల పంచెకట్టులో కనిపిస్తున్నారు. ఈ షోలో పవన్ తన మేనల్లుళ్ళగురించి మాట్లాడుతున్న సమయంలో వారు షోలోకి ఎంట్రీ ఇస్తారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్‌ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడగడం వంటి టీజర్‌లో చూపించారు.