బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2023 (10:00 IST)

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను చంపేస్తారా?

Ratan tata
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ప్రాణముప్పు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు భద్రతను పెంచాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా రతన్ టాటాను గుర్తు తెలియని ఓ వ్యక్తి బెదిరించాడు. దీంతో టాటా ప్రామాలకు ముప్పు పొంచివుందని, పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైరస్ మిస్త్రీ మాదిరిగానే జరుగుతుందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన హెచ్చరించాడు. ఆ హెచ్చరించిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 
 
కర్ణాటక నుంచి ఫోన్ చేశాడని దర్యాప్తులో తేల్చారు. కాగా నిందితుడు కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బెదిరింపు కాల్ అయినన్పటికీ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. రతన్ టాటా నివాసం వద్ద వెంటనే తనిఖీలు చేపట్టి భద్రతను పెంచినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 
 
వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ గతేడాది సెప్టెంబరులో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కారులో అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
కదలుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్‌లో దారుణం 
 
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. క్యాబిన్‌లో కూర్చొన్న బాలికపై వంతుల వారీగా ఇద్దరు డ్రైవర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. బస్సులోని ప్రయాణికులు అనుమానంతో క్యాబిన్ డోర్ తీయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ తర్వాత డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదాడు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఫూల్ చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు డిసెంబర్ 9న రాత్రి 7:30 గంటల సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్‌లోనే కూర్చొని ప్రయాణించింది. క్యాబిన్‌లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్ చంద్ మీనా వివరించారు.
 
ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు క్యాబిన్ డోర్ తెరవడంతో ఈ అఘాయిత్యం బయటపడింది. బాలిక దీన స్థితిలో ఉండడాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారని మీనా వెల్లడించారు. అయితే ఒక డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తిని పట్టుకున్నారని చెప్పారు. ప్రయాణికులు బస్సును ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి ఆపారని, బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. 
 
బాలిక మామయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారని ఫూల్ చంద్ మీనా పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న బాలిక మావయ్య అత్యాచారంపై ఫిర్యాదు చేశాడని వివరించారు. కాగా నిందిత బస్సు డ్రైవర్లలో మహ్మద్ ఆరిఫ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మరో నిందితుడిని లలిత్ గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటన 2012లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను గుర్తుకు తెచ్చింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరగగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెల్సిందే.