ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (10:08 IST)

ఇద్దరి సమ్మతంతో శృంగారంలో పాల్గొని... పెళ్లికి నిరాకరించడం తప్పుకాదు...

పరస్పర అంగీకారంతో యువతీ యువకులు శారీరకంగా కలిసి ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడం మోసినట్టు కాదని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైగా, ఈ కేసులో ఓ వ్యక్తిని 25 యేళ్ల తర్వాత నిర్దోషిగా ప్రకటించింది. పైగా, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. పైగా, పెళ్లికి నిరాకరించడం సెక్షన్ 147 కింద నేరం కాదని చెప్పారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని పాల్గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని పేర్కొంటూ ఓ మహిళ గత 1996లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన పాల్గఢ్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చారు. 
 
ఈ తీర్పును దోషి బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు... నిందితుడిని నిర్దోషిగా తేల్చింది. వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని, పైగా, ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అతడికి ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. దీంతో ఈ కేసులో ఆ వ్యక్తి 25 యేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు.