సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:44 IST)

పాత పెన్షన్ విధానం రద్దు.. ఉద్యోగులకు ఎంకే స్టాలిన్ గుడ్ న్యూస్

MK Stallin
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుభవార్త చెప్పనున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడానికి తగిన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 
 
2003లో అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కారణంగా అనేక రాయితీలను ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది. 
 
దీనిని వ్యతిరేకిస్తూ గత 19 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాడుతూనే ఉన్నారు. కొత్త విధానం కారణంగా పదవీ విరమణ పెన్షన్‌ను, వైద్యబీమాను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితులు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌ గడ్‌ వంటి రాష్ట్రాలు కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానం మీద దృష్టి పెట్టాయి. అలాగే, మరికొన్ని రాష్ట్రాలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఉద్యోగుల సంఘం ప్రభుత్వం ముందు తమ విజ్ఞప్తిని ఉంచుతూ లేఖాస్త్రం సంధించింది. ఇందుకు ఆర్థిక కార్యదర్శి గోపాలకృష్ణన్‌ సమాధానం ఇస్తూ పేర్కొన్న అంశాలు ఉద్యోగుల్లో ఆశలు రెకెత్తించారు. 19 సంవత్సరాల పాటుగా జరిగిన పోరాటానికి ఫలితం దక్కబోతోందన్న హర్షం వ్యక్తం చేశారు.  
 
పాత పెన్షన్‌ విధానం అమలుకు తగ్గ సాధ్యాసాధ్యాల పరిశీలనకు నియమించిన కమిటీ తన సిఫారసుల్ని సీఎం స్టాలిన్‌కు సమర్పించినట్టు వివరించారు.