శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (21:39 IST)

సుశాంత్ కేసు.. వణికిపోతున్న రియా.. అరెస్ట్ చేస్తారా? 10 గంటల పాటు విచారణ

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోవైపు సుశాంత్‌ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడంతో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు ఈ కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంచలన విషయాలు బయటకు తీస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో రాజ్‌పుత్ మృతి కేసులో ఈరోజు సీబీఐ విచారణకు రియా చక్రవర్తి హాజరైంది. ముంబైలోని డీఆర్‌డీవో గెస్ట్ హౌజ్‌లో ఉంటున్న సీబీఐ అధికారుల వద్దకు ఇవాళ ఉదయం రియా వెళ్లింది. ఈ కేసులో రియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రియా చక్రవర్తికి కష్టాలు తప్పేలా లేవు. 
 
శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట విచారణకు హాజరయిన రియాని ఇంకా ప్రశ్నిస్తోంది సీబీఐ టీమ్. కొద్దిసేపటి క్రితం ముంబై పోలీసుల టీమ్ ఒకటి లోపలికి వెళ్ళింది. ఈ టీమ్‌లో భారీగా లేడీ కానిస్టేబుల్స్ ఉండడంతో ఆమె అరెస్ట్ తప్పదు అనే వాదన వినిపిస్తోంది.
 
నిజానికి సీబీఐ వర్గాల సమాచారాన్ని బట్టి రియాని శుక్రవారం అరెస్ట్ చేయకపోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ సీబీఐ వేరువేరుగా వేరు వేరు చోట్ల ప్రశ్నిస్తోంది. సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థను కొద్దిసేపటి క్రితం డీఆర్డీఓ భవన్‌కి తీసుకువచ్చింది సీబీఐ టీమ్. 
 
అయితే డ్రగ్స్ డీలర్స్‌తో మాట్లాడానని చెబుతోన్న రియా తనకు మాత్రం అలవాటు లేదని చెప్తోంది. కేవలం సుశాంత్ కోసమే వారితో మాట్లాడానని ఆమె చెబుతోంది. కుటుంబంతో సుశాంత్‌కి అంత మంచి సంబంధాలు లేవని కూడా చెబుతోంది. కానీ రియాతో విచారిస్తున్న సందర్భంగా ఆమె చేతులు, కాళ్ళు వణికిపోయాయని.. దీనిని సీబీఐ అధికారులు గుర్తించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.