'అమ్మ' స్థానానికి హీరో విశాల్ నామినేషన్... ఆశ్చర్యపోతున్న ఆర్కే పీపుల్
తమిళ నటుడు విశాల్ అనూహ్యంగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నారు. ఆర్.కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్ సొంతంగా పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పక్క
తమిళ నటుడు విశాల్ అనూహ్యంగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నారు. ఆర్.కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్ సొంతంగా పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పక్కా ప్రణాళితోనే విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాల్ కొంతమంది సీనియర్ రాజకీయవేత్తలను కలిసి వారి అభిప్రాయం తీసుకున్న తరువాతనే రాజకీయాల్లోకి వెళుతున్నారని, ఇప్పటికే విశాల్ పార్టీ పేరు.. పార్టీ గుర్తు రెండూ కూడా ఏంటన్నది ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
విశాల్ పార్టీ పేరు అమ్మా ప్రజాపార్టీ... గుర్తు త్రిశూలం. విశాల్‌కు శక్తి స్వరూపిణి అమ్మవార్లంటే ఎంతో భక్తి. తన ప్రతి సినిమాలో ఖచ్చితంగా అమ్మవారికి మ్రొక్కే సీను ఉంటుంది. అందుకే విశాల్ సెంటిమెంట్‌గా ఈ గుర్తును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
అమ్మా ప్రజా పార్టీ అనేది దేవత పేరు మీద వస్తుంది కాబట్టి తమిళ ప్రజలకు ఈ పార్టీ పేరు, గుర్తు బాగా చేరుతుందని విశాల్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. 2021 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తెలుగువాడైన విశాల్ ఏకంగా అమ్మ జయలలిత స్థానంలో పోటీ చేయడంపై ఆర్కే నగర్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి అతడికి ఓటు వేసి గెలిపిస్తారో లేదో చూడాల్సి వుంది.