గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (16:44 IST)

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు: అత్తమ్మ సెంటిమెంట్-జయ మేనకోడలు దీప గుర్తు కోడిపుంజు?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. రెండాకులు మూడాకులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లపై ముప్పేట దాడి చేస

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. రెండాకులు మూడాకులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లపై ముప్పేట దాడి చేసేందుకు శశికళ వర్గం, ఓపీఎస్ వర్గంతో పాటు దీప కూడా రెడీ అయిపోతోంది. దీప ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుపోకుండా ఒంటరి పోరు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కోడిపుంజు గుర్తుతో ఆర్కే నగర్ ఎన్నికల్లో దీప బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 
 
జయలలిత మరణానికి తర్వాత ఖాళీగా ఉన్న ఆర్కే నగర్ స్థానంలో రెండాకులతో ఓపీఎస్ వర్గం ముందుకెళ్తుంటే.. శశికళ కూడా రెండాకుల చిహ్నంతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దీప ఏ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగుతారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే దీప కోడిపుంజు గుర్తు పట్ల ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఎంజీఆర్ మరణానికి అనంతరం రెండాకుల చిహ్నం ఎవరికీ కేటాయించబడలేదు. దీంతో ఎంజీఆర్ సతీమణి జానకి రెండు పావురాల గుర్తుతో, జయలలిత కోడిపుంజు గుర్తుతో పోటీచేశారు. ఆ సెంటిమెంట్‌తోనే.. దీప కూడా కోడిపుంజు చిహ్నాన్ని ఎంచుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్నికల సంఘంతో దీప కోడిపుంజు గుర్తుకోసం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.