శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2019 (15:57 IST)

అమావాస్య రోజున మాత్రమే అలా చేస్తారు..

దొంగతనం చేయడానికి కూడా ఒకరోజును ఎంచుకుంది ఓ దొంగలముఠా. కేవలం అమావాస్య రోజున మాత్రమే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమావాస్య రోజున దొంగతనాలు చేస్తుండడంతో వారిని అమావాస్య గ్యాంగ్ అని పిలుస్తారు. 
 
అమావాస్య గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు తుమకూరు టౌన్‌ సీతకల్లు గ్రామం నివాసి గణేశ్, తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా వడ్డగెరె గ్రామం నివాసి వినయ్‌కుయార్‌లుగా గుర్తించారు. వీరు కేవలం అమావాస్య రోజే బైక్‌ చోరీలకు పాల్పడుతుండడం విశేషం.
 
నిందితులు బెంగళూరు, తుమకూరు, నెలమంగల పరిధిలోనే బైక్‌లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితుల సహాయంతో కస్టమర్‌లకు విక్రయించేవారు. రెండు రోజుల క్రితం బెంగళూరు గొట్టగెరెలో యమహా ఎఫ్‌జడ్‌ బైక్‌ చోరీ చేసి తుమకూరు వైపు వెళ్తుండగా లక్కూరు గ్రామం వద్ద దాబస్‌పేట పోలీసులు పట్టుకున్నారు. 
 
ఇద్దరినీ విచారించగా.. నిజం బయటకు వచ్చింది. తమ వద్ద 13 ఖరీదైన బైక్‌లు ఉన్నాయని వారు తెలిపారు, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరి గ్యాంగ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ చోరీలు చేసారనే సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు.