వేలంటైన్స్ డే ఆఫర్ : మీ మాజీ లవర్ ఫోటో తగలబెడితే..

valentine
Last Updated: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (13:02 IST)
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు, హోటల్స్ తమకు తోచిన విధంగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ఎంబీఏ చావా వాల్ అనే కేఫ్.. ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు సింగిల్‌గా ఉండే యువతీ యువకులకు ఉచితంగా తేనీరు సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది.

అలాగే, ఇపుడు బెంగుళూరులోని ఓ రెస్టారెంట్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. "మేం ఓ పెను సవాల్ విసురుతున్నాం, ప్రేమికుల దినోత్సవ ఉత్తేజాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. ప్రేమికుల దినోత్సవం రోజున మీ మాజీ (ప్రేయసి/ప్రియుడు) ఫొటోని తగలబెట్టి, ఉచితంగా భోజనానంతర తినుబండారాన్ని పొందండి" అని ప్రకటించింది.

బెంగళూరుకు చెందిన రౌండప్ కేఫ్ ఈ ఆఫర్ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఐడియా నిజంగా బాగుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా, ప్రేమికుల దినోత్సవం రోజున ఇలాంటి పిచ్చిపనులు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :