మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (21:09 IST)

వేలంటైన్స్ డే సెలెబ్రేషన్స్ : ఎంబీఏ చాయ్ వాలా బంపర్ ఆఫర్.. ఏంటది?

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులను ఆకర్షించేందుకు హోటల్, వాణిజ్య, వ్యాపార సంస్థలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా, ప్రేమ జంటను ఆకర్షించేందుకు వినూత్న ప్రయోగాలూ చేస్తుంటాయి. అయితే, అహ్మదాబాద్‌లోని ఓ కేఫ్ నిర్వాహకుడుకి వినూత్న ఆలోచన వచ్చింది. తమ కేఫ్‌కు సింగిల్‌గా వచ్చే వారికి ఉచితంగా తేనీరును ఇవ్వనన్నట్టు ప్రకటించారు.
 
'ఎంబీఏ చాయ్ వాలా' పేరుతో నడిచే ఈ కేఫ్... ప్రేమికుల దినోత్సవం రోజైన ఫిబ్రవరి 14వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉచితంగా టీ సర్వ్ చేయనుంది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
 
అహ్మదాబాద్‌లోని వస్త్రపూర్‌లో ఈ కేఫ్ ఉంది. దీన్ని ఓ ఎంబీఏ చదువును మధ్యలో ఆపేసిన (ఎంబీఏ డ్రాపౌట్) ప్రఫుల్ బిల్లర్ అనే యువకుడు నడుపుతున్నాడు. ఇందులో 35 రకాల తేనీరుతో పాటు స్నాక్స్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. 
 
ఇదే విషయంపై ప్రఫుల్ మాట్లాడుతూ, ప్రేమికుల రోజున ప్రతి ప్రేమ జంటా జరుపుకుంటుంది. కానీ, సింగిల్‌గా వుండే స్త్రీపురుషుడు కూడా ఇదే విధంగా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఉచితంగా టీని సర్వ్ చేయాలని నిర్ణయించాను. ఈ ఆఫర్‌ను ప్రతి స్త్రీపురుషుడు తప్పకుండా ఉపయోగించుకుంటారని తాను నమ్ముతున్నట్టు చెప్పాడు. సో.. అహ్మదాబాద్‌లో సింగిల్‌గా ఉండే స్త్రీపురుషులు ప్రేమికుల దినోత్సవం రోజున ఎంబీఏ చాయ్‌వాలాలో ఉచితంగా తేనీరును సేవించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.... ఎంబీఏ చాయ్‌ వాలా కేఫ్‌కెళ్ళి వేడివేడి టీని సేవించండి.