బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (16:13 IST)

కరోనా ఎఫెక్ట్.. యూపీలో నిత్యావసరాల కోసం రూ.1000 సాయం

కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ వేలమంది ప్రాణాలను బలిగొంటుంది. ఆ వైరస్‌కు మందు లేదు కేవలం నివారణ ఒక్కటే మార్గం. కరోనాకు బయపడి ఇప్పటికే పలు రాష్ట్రాలు బంద్‌ను ప్రకటించాయి.

అయితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ మాత్రం అక్కడి పేద ప్రజల బాధను అర్థం చేసుకొని వారికి నిత్యావసరాల కోసం రూ. 1000 సాయం ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
యూపీలోని డెయిలీ లేబర్ మరియు భవన నిర్మాణ కార్మికులకు రోజుకు రూ. 1000 ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం ఆదిత్యానాథ్ తెలిపారు. ఈ సాయం వల్ల దాదాపు 15 లక్షల మంది రోజువారి కార్మికులు మరియు 20.37 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు.

అంతేకాకుండా.. 1.65 లక్షల కుటుంబాలకు ఒక నెల ధాన్యం ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు వెంటనే వేతనాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో ఒకేసారి రెండు నెలల పెన్షన్ ఇస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని బిపిఎల్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో దేనికీ కొరత లేదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కరోనా వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఆర్థికసాయం ప్రకటించలేదు.

కానీ.. యోగీ మాత్రం యూపీ ప్రజల కోసం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఇప్పటివరకు 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో 9మంది రికవరీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల దాదాపు 11 వేల మందికి పైగా చనిపోగా.. 2 లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు. ఈ వైరస్ దాదాపు 195 దేశాలలో విస్తరించింది.