శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (11:09 IST)

చిన్నమ్మ భర్త నటరాజన్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం.. పెరోల్ కోరుతూ..?

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్.. శనివారం తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యుల సమాచారం. ఇప్

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్.. శనివారం తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యుల సమాచారం. ఇప్పటికే భర్త ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో శశికళ పెరోల్ కోరినట్లు తెలిసింది. నటరాజన్‌కు లివర్ సమస్యలున్నాయని.. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని గ్లోబల్ హెల్త్ సిటీ వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు తమిళనాడు సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఓసారి భర్త అనారోగ్యం పేరిట శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆమె ఆసుపత్రిలో కాకుండా, రాజకీయ భేటీలకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తాజాగా నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుండటంతో పెరోల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.