సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (12:05 IST)

జయమ్మ అంత్యక్రియల్లో నటరాజన్ ఓవరాక్షన్.. ఏడీఎంకేలో శశికళతో కలిసి చక్రం తిప్పుతారా? ఓపీ పరిస్థితి?

తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో ఆమె నెచ్చెలి శశికళ అన్నీ తానై చూసుకున్నారు. అమ్మ భౌతికకాయం పక్కనే కూర్చుని.. నివాళులు అర్పించే వారిని పలకరించిన శశికళ, అంత్యక్రియలను కూడా తన చేతి మీదనే చేయించారు. అ

తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో ఆమె నెచ్చెలి శశికళ అన్నీ తానై చూసుకున్నారు. అమ్మ భౌతికకాయం పక్కనే కూర్చుని.. నివాళులు అర్పించే వారిని పలకరించిన శశికళ, అంత్యక్రియలను కూడా తన చేతి మీదనే చేయించారు. అయితే పోయెస్ గార్డన్ నుంచి రాజాజీ హాలుకు.. అక్కడ నుంచి మెరీనా బీచ్ వరకు శశికళ భర్త నటరాజన్ తన పవర్ చూపించారు. 
 
పనులన్నీ చేస్తూ.. శశికళకు నేనున్నానన్నట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జయలలిత మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 
 
సోమవారం ఆయన జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకుని అంజలి ఘటించడం ఇందుకు బలం చేకూరుస్తోందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలితకు శశికళ ఆప్తురాలిగా మారాక ఐఆర్ఎస్ అధికారి అయిన ఆమె భర్త నటరాజన్ ప్రభుత్వంలో, పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేవారు. అయితే ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న జయలలిత అతడిని దూరంగా పెట్టేశారు. ఒకానొక సందర్భంలో శశికళను కూడా ఇంటి నుంచి పంపించేశారు. అయితే వేరే గత్యంతరం లేక శశికళ వారి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. ఆ తర్వాతే అమ్మ ఆమెకు తన ఇంట్లోకి రానిచ్చారు. 
 
ఇన్నాళ్లూ జయకు దూరంగా ఉన్న నటరాజన్ సోమవారం పోయెస్ గార్డెన్‌కు వచ్చారు. మంగళవారం రాజాజీహాల్‌కు వచ్చి జయకు నివాళి అర్పించారు. అంత్యక్రియలకూ హాజరయ్యారు. దీంతో పార్టీలోకి ఆయన పున:ప్రవేశం జరిగినట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జయ మృతి తర్వాత ముఖ్యమంత్రి ఎంపికలో కీలకంగా వ్యవహరించిన శశికళ.. ఇప్పుడు భర్తతో కలిసి చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
 
అదే కనుక జరిగితే జయలలిత నమ్మిన బంటు ప్రస్తుత సీఎం ఓ పన్నీర్ సెల్వంకు కష్టాలు తప్పవని.. ఆయనను పక్కనబెట్టి నటరాజన్ శశికళను సీఎం చేసేందుకైనా వెనుకాడడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది జరిగితే అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమవుతాయని.. ఇది ప్రతిపక్షానికి ప్రభుత్వానికి కూల్చేందుకు అవకాశంగానూ మారే ఛాన్సుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.