1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 మే 2015 (11:04 IST)

ప్రేమికులకు మరణశిక్షను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సుప్రీం కోర్టు

ప్రేమికులకు సుప్రీం కోర్టు మరణశిక్షను తప్పించింది. ప్రేమికులకు మరణశిక్షను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన జస్టిస్ ఏ.కే. సిక్రీ, జస్టిస్ యు.యు.లలిత్‌‌లతో కూడిన ధర్మాసనం, కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. షబ్నం, సలీమ్ ప్రేమించుకున్నారు. అయితే, షబ్నం ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తన కుటుంబ సభ్యులందర్నీ హతమార్చాలని నిర్ణయించుకున్న ఆమె, అందుకు ప్రియుడిని ఉసిగొల్పింది. 2008 ఏప్రిల్ 15న తన ఇంట్లోని ఏడుగురికి ఆమె మత్తుమందు కలిపిన పాలను ఇచ్చింది. వారు మగతలోకి జారుకోగా, ఆపై ప్రేమికులిద్దరూ కలసి ఒక్కొక్కరినీ హత్య చేశారు. 
 
షబ్నం తన 10 నెలల మేనల్లుడిని కూడా విడిచిపెట్టలేదు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కేసు విచారించిన కోర్టు వారికి మరణశిక్షను విధించింది. హైకోర్టు కూడా దీనిని ఖరారు చేసింది. వీరిని ఉరితీసేందుకు అధికారులు సిద్ధమవుతున్న వేళ, తమ శిక్షను నిలిపివేయాలని వీరు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడంతో పాటు మరణశిక్షను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.