సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (08:03 IST)

అలనాటి నటీమణి గీతాంజలి కన్నుమూత

అలనాటి నటీమణి గీతాంజలి (62) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు.

1957లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గీతాంజలి జన్మించారు. ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం,హిందీ చిత్రాలలో ఆమె నటించారు.

తెలుగులో 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. బొబ్బిలి యుద్ధం, దేవత, లేతమనసులు,తోడు-నీడ, గుఢచారి-116 వంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు.

గీతాంజలి నటించిన తొలి సినిమా సీతారామ కల్యాణం అయితే.. చివరి సినిమా దటీజ్ మహాలక్ష్మీ. ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది. తమిళంలో 13,హిందీలో5,మళయాలంలో 3సినిమాల్లో గీతాంజలి నటించారు. తెలుగులో ఎన్టీఆర్,ఏఎన్నార్,రామకృష్ణ సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు.