శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (13:14 IST)

సహచర విద్యార్థినిపై ఆరు మానవ మృగాలు ఇలా ప్రవర్తించాయి (వీడియో)

కళాశాల విద్యార్థులు నీచంగా ప్రవర్తించారు. ఒడిశాలో కొందరు విద్యార్థులు సహచర విద్యార్థినిని లైంగికంగా వేధించారు. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. అక్కడే ఉన్న ఒక విద్య

కళాశాల విద్యార్థులు నీచంగా ప్రవర్తించారు. ఒడిశాలో కొందరు విద్యార్థులు సహచర విద్యార్థినిని లైంగికంగా వేధించారు. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని బర్గడ్ జిల్లాలో కళాశాల ముగిసిన తర్వాత విద్యార్థులు గుంపుగా ఇంటికి వెళ్తుండగా.. ఆరుగు మృగాళ్లు మొహానికి మాస్కులు ధరించి యువతిని వేధించారు. అయితే ఆ యువతి ఆ మృగాళ్ల నుంచి తప్పించుకుని పారిపోయింది.  
 
అక్టోబర్‌ 4న ఈ ఘటన జరిగిన చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో సాక్ష్యంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసి.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.