సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఆయన పేరులో రాముడు.. నా పేరులో శివుడు ఉన్నారు..: డికే శివకుమార్

Siddaramaiah-Shivakumar
తమ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరులో రాముడు, తన పేరులో శివుడు ఉన్నారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అందువల్ల అయోధ్యలో రామమందిరంలో బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుండగా రాష్ట్రంలో సెలవు ప్రకటించాలని తమకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని, ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదన్నారు. 
 
సోమవారం పలు రాష్ట్ర ప్రభుత్వాలు సెవలు ఇవ్వడంపై ఆయన స్పందించారు. భక్తి గౌరవం ధర్మప్రచారం చేయబోమని, బీజేపీ నేతలు సెలవు ప్రకటించాలన్న డిమాండ్‌కు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరులో రాముడు, తన పేరులో శివుడు ఉన్నారని, దీని వల్ల తమకు ఒకరు చెప్పాల్సిన, ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదన్నారు. 
 
మతం ఉండి తీరాలి. అందులో రాజకీయం ఉండకూదన్నారు. భక్తి, మతం, తదితర వాటిని గురించి తాము ప్రచారం ఆశించబోమని, ఇతరులు చెప్పే ముందే దేవస్థానాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశించినట్లు గుర్తుచేశారు. 
 
దేవస్థానాల్లో ఎలా పూజ నిర్వహించాలో అక్కడ పూజారులు కలిసి తీర్మానించి ఆచరిస్తారని తెలిపారు. పూజలు, ప్రార్థనలతో ఫలితం దక్కుతుందని నమ్మే వారిలో తాను కూడా ఉన్నట్లు చెప్పారు. సమాజం బాగుండాలని అందరూ కలిసి పూజలు, ప్రార్థనలు చేయాలని సూచించారు.