సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (18:49 IST)

#90’s నా కెరీర్ లో మెమరబుల్ గా నిలిచిపోతుంది : హీరో శివాజీ

Shivaji, Vasuki Anand Sai, Aditya Haasan, Naveen Medaram and others
Shivaji, Vasuki Anand Sai, Aditya Haasan, Naveen Medaram and others
హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'- ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ . ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరిస్ ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మించ్రు. నవీన్ మేడారం సమర్పించారు. ఈటీవీ విన్‌’వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్ సిరిస్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
 
సక్సెస్ మీట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. #90’s' ఒక్క ఎపిసోడ్ విన్నా ఓకే చేసే కథ ఇది. అంత బావుంది. నేను చేసిన 'మిస్సమ్మ' అప్పటికి ఇండియన్ టాప్ 50సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ ఇండియన్ ఓటీటీలో టాప్5 లో ఉండటానికి అన్ని క్యాలిటీస్ వున్న వెబ్ సిరిస్ #90’s. మంచి యంగ్ టీంతో కలసి ఈ సిరిస్ చేశాం. ఈ ఒక్క సిరిస్ తో ఐదు లక్షల సబ్ స్క్రైబర్స్ రావడం మాములు విషయం కాదు. ఆదిత్య అద్భుతంగా రాశాడు. ఈ సక్సెస్ క్రెడిట్ తనదే. #90’s నా కెరీర్ లో మెమరబుల్ గా నిలిచిపోతుంది. ఇది ఫిలింలా కూడా విడుదల చేస్తారని అనుకుంటున్నాను. మంచి కంటెంట్ ని ప్రోత్సహించడానికి ఈ వేడుకకు విచ్చేసిన ఆర్పీ పట్నాయ్ గారికి ధన్యవాదాలు. అజీం వండర్ ఫుల్ కెమరామెన్. సురేష్ గారు చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. సాంప్రదాయని ట్యూన్ సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. టీం అందరూ అద్భుతంగా పని చేశారు. ప్రొడక్షన్ అంత చాలా చక్కగా జరిగింది. ప్రతి క్యారెక్టర్ ని దర్శకుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. మౌళి, రోహన్, వాసంతిక అందరూ చక్కగా చేశారు. అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. వాసుకి గారు చాలా అద్భుతంగా నటించారు. ఈటీవీ విన్ కి కృతజ్ఞతలు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'' తెలిపారు.  
 
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరిస్ లో జీవితం వుంది. మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరిస్ ఇది. వాసుకి గారు ఎంతో సహజంగా నటించారు. నా చిన్నప్పుడు మా అమ్మలా అనిపించారు. శివాజీ గారిని బిగ్ బాస్  లో చూసి అందరూ ప్రేమించారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం వున్న వ్యక్తి. రోహన్ చాలా చక్కని టైమింగ్ తో నటించాడు. దర్శకుడు ఆదిత్య ఓ మాస్టర్ పీస్ ని అందించారు. సురేష్ బొబ్బిలి చాలా చక్కని సంగీతం అందించారు. తను ఇంకా పెద్ద సినిమాలు ప్రాజెక్ట్స్ చేయాలి. టీం అందరికీ అభినందనలు. సంక్రాంతికి థియేటర్స్ నే కాదు ఓటీటీలు కూడా హిట్స్ ఇస్తాయనడానికి '#90’s' నిదర్శనం'' అన్నారు
 
వాసుకి మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం కుదిరింది. అది ఈరోజు నిజం కావడం ఆనందంగా వుంది. ఈ నిర్మాణ సంస్థలో పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి టీంతో కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ విజయంలో భాగం కావడం ఆనందంగా వుంది'' అన్నారు
 
 దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ... #90’s రీచ్ అద్భుతంగా వుంది. ముఖ్యంగా 90 కిడ్స్ చాలా వోన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. శివన్న, వాసుకి గారికి థాంక్స్. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాంప్రదాయని ట్యూన్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రెడిట్ సురేష్ బొబ్బిలి గారికి దక్కుతుంది. మా నిర్మాతలుకు కృతజ్ఞతలు. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలిపారు