బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 10 మే 2018 (21:42 IST)

మైనింగ్ కేసుకి రూ. 160 కోట్ల లంచం... శ్రీరాములు భాజపాను అడ్డంగా బుక్ చేసేశాడా

గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడిగా పేరున్న శ్రీరాములుకి సంబంధించి ఓ వీడియో టేప్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఇది ఏదో సాధారణమైనది కాదు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అల్లుడితో మైనింగ్ కేసు నుంచి బయటపడేసేంద

గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడిగా పేరున్న శ్రీరాములుకి సంబంధించి ఓ వీడియో టేప్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఇది ఏదో సాధారణమైనది కాదు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అల్లుడితో మైనింగ్ కేసు నుంచి బయటపడేసేందుకు గాను రూ. 160 కోట్ల డీల్ కుదుర్చుకుంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ కన్నడ ప్రైవేట్ చానల్ టెలికాస్ట్ చేస్తోంది.
 
ఎన్నికల వేళ భాజపాను ఇది తీవ్రంగా ఇబ్బంది పెట్టే విషయమే. వీడియోలో వారి సంభాషణ మొత్తం చాలా స్పష్టంగా వుండటంతో ఇక అనుమానాలు కూడా ఏమీ లేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ అవినీతిలో కర్నాటక కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయిందంటూ భాజపా అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలకు షాకిచ్చేలా ఇప్పుడు ఈ వీడియో తయారైంది. కర్నాటక ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు... కానీ శ్రీరాములుకి ఇచ్చారు. పైగా తమ పార్టీ గెలిస్తే డిప్యూటీ సీఎం శ్రీరాములే అనే ప్రచారం కూడా సాగుతోంది. 
 
ఈ నేపధ్యంలో ఇలా రూ. 160 కోట్ల లంచం ఇవ్వజూపుతూ వీడియోలో ఆయన అడ్డంగా దొరికిపోవడంతో భాజపా నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. మరో విషయం ఏమిటంటే... శ్రీరాములు ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైనే బదామి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఎన్నికల వేళ ఈ వీడియో ఎంతటి షాకిస్తుందో చూడాలి.