శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (09:04 IST)

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

si suicide attempt
న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక... ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎస్ఐ రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జరిగింది. కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని ఎస్ఐ ఆవేదన చెందారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం ఎస్ఐ కోర్టులో హాజరుపర్చారు. అయితే నకిలీ వ్యక్తులను అరెస్టు చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని ఎస్ఐ కన్నీరు పెట్టారు. సహచర పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చి కేసు పెట్టించారు.