గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (09:46 IST)

సరోజ్ ఖాన్ కు అస్వస్థత

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తీవ్ర అస్వస్థతతో ముంబై బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్నారు.

ఆమెకు వైద్యులు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. సరోజ్ ఖాన్ క్రమంగా కోలుకుంటున్నారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.

సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ  అవార్డులు లభించాయి.