గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (11:21 IST)

భక్తురాలి సాయంతో యువతిపై కీచక బాబా అత్యాచారం...

మహిళా భక్తురాలి సహాయంతో ఓ కీచక బాబా మరో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

మహిళా భక్తురాలి సహాయంతో ఓ కీచక బాబా మరో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాష్ట్రానికి చెందిన సీతాపూర్‌ బాబా అలియాస్ మహంత్ సియారామ్ దాస్‌లు పలు విద్యాసంస్థలను నడుపుతున్నాడు. ఈయనపై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే 21 ఏళ్ల దళిత యువతిని ఆమె బంధువు ఒకరు, బాబా పరమ భక్తురాలు రింటూ సింగ్‌ అనే మహిళకు అమ్మేసి వెళ్లిపోయాడు. ఆపై ఆ యువతిని రింటూ సింగ్ బాబా దగ్గరకు తీసుకెళ్లి అప్పగించింది. ఇక అప్పటి నుంచి 8 నెలలపాటు తన ఆశ్రమంలో యువతిపై సియారామ్‌ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఇదిలావుండగా, ఆ కీచక బాబా అరాచకాన్ని తట్టుకోలోని ఆ యువతి కంట్రోల్‌ రూంకి సమాచారం అందించటంతో వ్యవహారం వెలుగు చూసింది. బాబా దగ్గరికి వచ్చిన మరికొందరు కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి చెబుతోంది. ఈ క్రమంలో ఆగ్రాలో ఓ స్థల వివాదంలో సెటిల్‌మెంట్‌కు వెళ్లిన సియారామ్‌ను మాటు వేసి సీతాపూర్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.