గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:41 IST)

ఆ డాక్టర్ నిత్య పెండ్లి కూతురు... మూడు పెళ్లిళ్లు.. ఒకరితో సహజీవనం

ఆమె హోమియోపతి వైద్యురాలు. డబ్బుమైకంలో పడిపోయింది. పేరుకు పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టడం, రూ.లక్షల్లో దండుకుని విడాకులు ఇవ్వడం. మళ్లీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం...

ఆమె హోమియోపతి వైద్యురాలు. డబ్బుమైకంలో పడిపోయింది. పేరుకు పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టడం, రూ.లక్షల్లో దండుకుని విడాకులు ఇవ్వడం. మళ్లీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం... అతనివద్ద చేతికి అందినంత వసూలు చేయడం. ఇదీ ఆ మహిళా వైద్యురాలి నిర్వాకం. ఇలా ముగ్గురిని మోసం చేస్తూనే.. మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ వచ్చింది. అయితే, మూడో భర్తపై తప్పుడు వరకట్న కేసు పెట్టి జైలుపాలైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ వనస్థలిపురం ఎస్‌కేడీ నగర్‌కు చెందిన బీవీఎస్ ప్రకాశ్‌ రావుకు హోమియోపతి డాక్టర్ సరితతో గత 2015 నవంబర్ 27న వివాహమైంది. అతని తల్లి వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ సరిత గత నెల 31వ తేదీన సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రకాశ్‌రావును అరెస్టు చేశారు. అతడు మూడు రోజుల తర్వాత జైలు నుంచి బయటికి వచ్చి సరిత గురించి విచారించగా అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు తేలింది. దీంతో అతను సరిత గురించి కూపీలాగారు. 
 
ఇందులో సరిత 2005లో కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన కె.రామనాథ శంకర్‌ను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వరకట్న వేధింపుల కేసు పెట్టి.. రాజీ పేరుతో రూ.6 లక్షలు, 20 తులాల బంగారం వసూలు చేసింది. ఆ తర్వాత అంటే 2011 మార్చి 18న హైదరాబాద్ చందానగర్‌కు చెందిన వెంకట రాంబాబును పెండ్లి చేసుకుంది. నెలరోజుల తర్వాత వరకట్న వేధింపుల కేసు పెట్టింది. రాజీలో భాగంగా రూ.9 లక్షలు తీసుకొని విడాకులు ఇచ్చేసింది. అనంతరం మహారాష్ట్రలోని పుణెకు చెందిన వీరేందర్‌తో సహజీవనం చేసింది. అతనిపై వేధింపుల కేసు పెట్టి బెదిరించి రూ.80 వేలు వసూలు చేసింది. 
 
ఇలా సరిత మోసాల చిట్టాకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించి వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు సరిత గత వివాహాల మ్యారేజ్ సర్టిఫికెట్లు, ఎఫ్‌ఐఆర్‌లు, విడాకుల పత్రాలు తదితర ఆధారాలను సేకరించి, పలువురుని మోసం చేసినట్టు నిర్ధారించుకుని ఆదివారం చేతులకు బేడీలు వేసి కటకటాలవెనక్కి పంపారు.