మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srini
Last Modified: బుధవారం, 2 మే 2018 (18:39 IST)

కాంగ్రెస్ గూటికి ఎస్‌.ఎం. కృష్ణ??

కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నాయకుడు ఎస్‌.ఎం. కృష్ణ, అటు కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడంలేదని భావిం

కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నాయకుడు ఎస్‌.ఎం. కృష్ణ, అటు కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే  కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడంలేదని భావించిన కృష్ణ గతేడాది బీజేపీలో చేరారు. 
 
కర్నాటక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రచారంలో జోరును పెంచాయి. పార్టీ నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ.. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న ఎస్‌.ఎం. కృష్ణ మాత్రం పార్టీ చేస్తున్న ప్రచారాలలో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. 
 
మరోవైపు కృష్ణ కేడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారాలలో పాల్గొంటున్నాయి. ఈ వ్యవహారంతో కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తి అయిన కృష్ణ.. కాషాయ పార్టీలో ఉండలేకపోతున్నారని, తనకు తగిన ప్రాధాన్యం లభించడంలేదని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్‌.ఎం. కృష్ణ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ఊహాగానాలు కూడా కర్నాటకలో వినిపిస్తున్నాయి.