సంబంధిత వార్తలు
- తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ
- Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
- 44 ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- అలాంటి వారంతా ఫేక్ ముస్లింలు : మేమంతా శ్రీరాముడి వంశస్థులమే... బీజేపీ నేత జమాల్ సిద్ధిఖీ
- కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?
పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య
తనను కలిసిన భారత ఆర్మీ చీఫ్ జనవర్ ఉపేంద్ర ద్వివేదీని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్యునను ఓ కోరిక కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి భారతదేశంలో కలపాలని, దానిని తనకు గురుదక్షిణగా సమర్పించాలని భారత సైన్యాధిపతిని కోరారు. ఇది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చిత్రకూట్‌లోని జగద్గురు ఆశ్రమానికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెళ్లారు. ఆయనకు స్వామీజీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. లంకకు వెళ్లే ముందు హనుమంతునికి "ఏ రామ్" మంత్ర దీక్షను ఇచ్చారో అదే దీక్షను జనరల్ ద్వివేదికి కూడా ఇచ్చినట్టు జగద్గురు రాంభద్రాచార్య తెలిపారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఆధ్యాత్మిక అంశాలపై చర్చ జరిగింది. ఆశ్రమంలోని ఇతర సాధువులు, విద్యార్థులతో కూడా ఆర్మీ చీఫ్ పిచ్చాపాటిగా ముచ్చటించారు.
ఈ భేటీ సందర్భంగా జగద్గురు రాంభద్రాచార్య మాట్లాడుతూ పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుని భారత్‌లో వినీలం చేయాలని, దాన్ని తనకు గురుదక్షిణగా ఇవ్వాలని కోరారు. హిందూ సంప్రదాయంలో గురువుకు శిష్యుడు సమర్పించే కానుక లేదా గౌరవాన్ని గురుదక్షిణ అంటారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
