గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (11:41 IST)

శ్రీనగర్‌లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు

Historic G20 Meet
Historic G20 Meet
జమ్మూ-కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో సోమవారం ప్రారంభం కానున్న జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
 
ఈ సమావేశాలకు జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అయితే అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పేసింది.