శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (10:51 IST)

సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం ప్రత్యేక పూజలు.. ఎక్కడ?

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఆదివారం సీఎం పీఠం కోసం ప్రత్యేక పూజలు చేశారన్నారు.  తమిళనాడుకు సీఎం కావాలనే ఆశతో పన్నీర్ సెల్వం ఆదివారం బ్రహ్మముహూర్త కాలంలో పూజలు చేశారని స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన తరుణంలో ఈ పూజలు జరిగాయని చెప్పుకొచ్చారు. 
 
అంతేగాకుండా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరహాలో కొడనాడు ఎస్టేట్ కేసులో పళనిస్వామి జైలు పాలవ్వాలని ఈ పూజలు జరిగాయని స్టాలిన్ ఆరోపణలు చేశారు. పళనిస్వామి జైలుకు వెళ్లగానే తాను సీఎం కావాలని పన్నీర్ సెల్వం కలలు కంటున్నారని స్టాలిన్ విమర్శలు గుప్పించారు. అన్నీ మతాలకు నిలయమైన సచివాలయంలో పూజలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.
 
ఇకపోతే, స్టాలిన్ విమర్శలను మంత్రి జయకుమార్ తిప్పికొట్టారు. అన్నాడీఎంకేలో చీలికలు తీసుకొచ్చేందుకు దినకరణ్, స్టాలిన్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.