శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:53 IST)

చెన్నై.. పాలు ప్యాకెట్ వేస్తున్నట్లు వెళ్లి.. మహిళపై అత్యాచార యత్నం..?

woman
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో వున్న తరుణంలో.. పాలు పాకెట్ వేసినట్లు వేసినట్లు డ్రామా చేసి ఓ మహిళపై అత్యాచారానికి యత్నించాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై, తిరుమంగళంలో నేపాల్‌కు చెందిన దంపతులు నివసిస్తున్నారు. భర్త సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో భార్య మాత్రమే ఇంట్లో ఒంటరిగా వుంటుంది. 
 
ఈ విషయాన్ని గమనించిన ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. పాల ప్యాకెట్ వేస్తున్నట్లు ఉదయం పూట వచ్చిన ఆ కామాంధుడు మహిళపై అత్యాచారానికి యత్నించాడు. కానీ సదరు మహిళ ప్రతిఘటించడంతో పారిపోయాడు. 
 
భర్త వచ్చిన తర్వాత ఈ విషయాన్ని భార్య చెప్పడంతో..పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో సీసీటీవీ ఆధారంగా మహిళపై అత్యాచారానికి యత్నించిన రామకృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.