బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (10:00 IST)

కుటుంబాన్ని కాపాడి అమరుడైన సుబేదార్ మదన్‌లాల్

ఉగ్రవాదులు తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వారికి ఎదురొడ్డి, తన కుటుంబ సభ్యులను ప్రాణాలతో రక్షించి చివరకు తాను మాత్రం అమరుడయ్యాడు ఓ జవాన్. అతని పేరు మదన్ లాల్ చౌదరి. భారత ఆర్మీల్ సుబేదార్‌గా పని చ

ఉగ్రవాదులు తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వారికి ఎదురొడ్డి, తన కుటుంబ సభ్యులను ప్రాణాలతో రక్షించి చివరకు తాను మాత్రం అమరుడయ్యాడు ఓ జవాన్. అతని పేరు మదన్ లాల్ చౌదరి. భారత ఆర్మీల్ సుబేదార్‌గా పని చేస్తున్నాడు. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సుంజ్వాన్ 36బ్రిగేడ్ సైనికశిబిరంలోకి శనివారం ఉగ్రవాదులు చొరబడిన విషయం తెలిసిందే. 42గంటలపాటు సాగిన ఆపరేషన్‌లో ముగ్గురు జైషే మొహమ్మద్ ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సైనికులు, ఇద్దరు భద్రతాసిబ్బంది ఉన్నారు.
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో మదన్ లాల్ ఒకరు. సుంజ్వాన్‌లో ఆర్మీ క్వార్టర్స్‌లోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు సుబేదార్ మదన్‌లాల్ చౌదరి తన ఇంట్లో ఉన్నాడు. అయితే కాల్పులు జరుపుతూ ఉగ్రవాదులు ద్వారం వద్దకు దూసుకొచ్చారు. ఆ క్షణంలో తను నిరాయుధుడు.
 
పైగా ఒక్కరోజు ముందే ఓ పెండ్లివేడుక కోసం షాపింగ్ చేసేందుకు ఆయన భార్య, పిల్లలు ఆ క్వార్టర్‌కు వచ్చారు. అప్పటికే వారంతా భయాందోళనలో ఉన్నారు. ఉగ్రవాదులు లోపలికి రాకుండా ద్వారం వద్దే వారిని అడ్డుకున్న మదన్‌లాల్ కుటుంబ సభ్యుల్ని వెనుక ద్వారం గుండా బయటకు వెళ్లిపోవాల్సిందిగా కేకలేశాడు. 
 
ఆగ్రహించిన ముష్కరులు తుపాకీతో తనపై కాల్పులు వర్షం కురిపిస్తున్నా, తన భార్య, పిల్లలు బయటకు వెళ్లేవరకు వారిని అడ్డుకుని, చివరకు నేలకూలాడు. కూతురు నేహాకు తూటా గాయం అయినప్పటికీ ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడిందంటే అందుకు మదన్‌లాల్ చూపిన తెగువే కారణం.