సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (12:20 IST)

పశువధ నిషేధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేకు నిరాకరణ

పశువుల రవాణా, వధపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. పశువధపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనపై స్టే విధించేందుకు సుప్రీం కోర్

పశువుల రవాణా, వధపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. పశువధపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 11కి వాయిదా వేసింది. 
 
ఆవులు సహా ఎద్దులు, గేదెలు, ఒంటెలు, పాడి ఆవులను వధ కోసం విక్రయించరాదంటూ.. మే 23న కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఫహీమ్ ఖురేషి ఈ పిటిషన్ వేశారు. కేంద్రం ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, వివక్షా పూరితమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
 
ఈ ఆదేశాలు పశువుల వ్యాపారంపై ఆధారపడిన వారి జీవనోపాధిని దెబ్బతీస్తాయని వాదించారు. ప్రభుత్వం తరపున అడిషినల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ హాజరై దేశవ్యాప్తంగా పశువుల వర్తకంపై ఓ నియంత్రిత విధానం ఉండాలన్న ఉద్దేశంతోనే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.