ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (22:32 IST)

దేశంలో మంకీ పాక్స్.. ఐసోలేషన్‌లో యువకుడైన పేషెంట్

monkey fox
కరోనా తర్వాత అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి ఎంపాక్స్. దేశంలో మంకీ పాక్స్ వైరస్ అనుమానిత కేసు నమోదైంది. మంకీపాక్స్ బారిన పడిన దేశం నుండి ఇటీవల తిరిగి వచ్చిన ఒక యువకుడిలో మంకీ పాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 
 
రోగి వైరస్ అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగిని ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
 
రోగి నమూనాలను తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే రోగికి పాక్స్‌ ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు. ఆఫ్రికా దేశాలతో పాటు మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా ఎంపాక్స్ కేసులు నమోదు అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.
 
Mpox అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలాగే చర్మంపై దద్దుర్లను కలిగిస్తుంది.