శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (20:04 IST)

కరోనాకు ఇంజెక్షన్ బదులు టాబ్లెట్​!

కరోనా మహమ్మారితో సీరియస్​ అవుతున్న పేషెంట్లకు ఇప్పుడు రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లతో ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దానిని టాబ్లెట్ల రూపంలో ఇచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరో ‘టాబ్లెట్​’ కరోనాను తగ్గిస్తోందట.

ఇప్పటికే ఫ్లూ కోసం వాడుతున్న మోల్నుపిరావిర్​ (ఎంకే 4482) అనే మందు హామ్​స్టర్స్​ (ఓ రకం ఎలుకలు)పై బాగా పనిచేస్తోందట. అమెరికాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్(ఎన్​ఐహెచ్​)కు చెందిన సైంటిస్టులు ఎలుకలకు ఈ మందులిచ్చి చూడగా మంచి ఫలితాలు వచ్చినట్టు తేలింది.

వైరస్ సోకడానికి 12 గంటల ముందు, సోకిన 12 గంటల తర్వాత కూడా మోల్నుపిరావిర్​ బాగా పనిచేస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి లంగ్స్​కు చేసే చెడును కూడా చాలా వరకు తగ్గించగలిగిందని అంటున్నారు.

కాబట్టి కరోనా బాధితులకు మోల్నుపిరావిర్​తో ట్రీట్​మెంట్​ చేస్తే మహమ్మారి తీవ్రతను తగ్గించొచ్చని సిఫార్సు చేస్తున్నారు.

మనుషులపై ఈ మందు పనితీరును తెలుసుకునేందుకు చేస్తున్న క్లినికల్​ ట్రయల్స్​తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. మొత్తం ట్రయల్స్​ పూర్తయ్యాక మోల్నుపిరావిర్​ పనితీరును వెల్లడిస్తామని చెప్పారు.