నిక్కర్లు వేసుకొని కవాతు చేయకూడదు: ఆర్ఎస్ఎస్‌కి మద్రాసు హైకోర్టు ఆదేశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు మద్రాసు హైకోర్టు ఓ సూచన చేసింది. ఆ సంస్థ చేసే యోగాసనాల (కవాతు)ను ఇకపై నిక్కర్లు వేసుకుని కాకుండా, ఫ్యాంటులు ధరించి చేయాలని సూచన చేసింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు మద్రాసు హైకోర్టు ఓ సూచన చేసింది. ఆ సంస్థ చేసే యోగాసనాల (కవాతు)ను ఇకపై నిక్కర్లు వేసుకుని కాకుండా, ఫ్యాంటులు ధరించి చేయాలని సూచన చేసింది.
ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో భాగంగా తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వేడుకలను నిర్వహించనుంది. ఇందులో కార్యకర్తలు నిక్కర్లు వేసుకొని కవాతు చేయకూడదని తెలిపింది. ఆర్ఎస్ఎస్ ఇటీవలే నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
కార్యకర్తలు ప్యాంట్లనే ధరించి కవాతులో పాల్గొనాలని న్యాయస్థానం సూచించింది. చెన్నై పట్టణ పోలీసు చట్టం ప్రకారం సాయుధ బలగాలు ధరించే యూనిఫాంలను ఇతరులు ధరించకూడదు. కానీ, ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ అదేవిధంగా ఉండటంతో దీనిపై వివాదం నెలకొంది.