సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:11 IST)

ప్రియురాలిని పెళ్లాడిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే!

ప్రేమించి మోసం చేసే ప్రియులు ఎక్కువైన ఈ రోజుల్లో అదీ ఓ రాజకీయ నేత తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. అదీకూడా అధికార అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యే కావడం గమనార్హం. 
 
ఆయన పేరు ప్రభు. తమిళనాడులోని కళ్లకురిచ్చి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. త్యాగదుర్గం మలైకొటై గ్రామానికి చెందిన సౌందర్య అనే బీఏ ఇంగ్లీష్ రెండో సంవత్సరం చదువుతున్న యువతిని గడచిన ఏడాదిన్నరగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యే యువతి కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు కూడా వివాహానికి సమ్మతించారు. దీంతో ఇరు కుటుంబాల సమ్మతితో ఈ వివాహం జరిగింది. 
 
కాగా, కరోనా నేపథ్యంలో, తక్కువ మంది అతిథుల మధ్య, నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. సౌందర్య తండ్రి గ్రామంలో అర్చకుడిగా పని చేస్తున్నారు. నూతన దంపతులకు పలువురు రాజకీయ నాయకులు ఆశీస్సులు, అభినందనలు అందించారు.