శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (11:48 IST)

చెన్నైలో కరోనా.. సినీనటుడు ప్రభుకు కరోనానా? ఆయన ఏమన్నారు?

Prabhu
చెన్నై నగరంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. సాధారణ జనంతో పాటు ప్రముఖులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. సెలబ్రెటీలు ఎవరైనా ఉన్నట్టుండి కనిపించకపోతే…వాళ్లు కరోనా బారిన పడ్డారని అందుకే బయటకు రావడం లేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు జనం. 
 
ఈ నేపథ్యంలోనే తాను కరోనా బారిన పడ్డానంటూ వచ్చిన వార్తలపై నటుడు ప్రభు స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. తనకు కరోనా రాలేదని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
 
తన తండ్రి నటుడు శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా గురువారం ఓ స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, నటులు హాజరయ్యారు.

అయితే ఈకార్యక్రమంలో ప్రభు కనిపించలేదు. దీంతో ఆయనకు కరోనా వచ్చిందంటూ నెట్టింట్లో ప్రచారం జరిగింది. న్యూస్ వైరల్ కావడంతో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తన కాలు బెనికిందని..అందువల్లే తాను కార్యక్రమానికి హాజరుకాలేదని వివరణ ఇచ్చారు.