శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2020 (12:58 IST)

అమేజాన్ ఉద్యోగులకు కరోనా.. 20,000 మందికి కోవిడ్ పాజిటివ్

ఈ-కామర్స్ సంస్థల్లో అగ్రగామి అయిన అమేజాన్‌కు కరోనా దెబ్బ తప్పలేదు. ఇప్పటివరకు 20వేల అమేజాన్ ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. గత మార్చి నుంచి ఇప్పటివరకు తమ సంస్థకు చెందిన 20,000 మందికి కోవిడ్ పాజిటివ్ సోకినట్లు తేలింది. ఆన్‌లైన్ వ్యాపారంలో ముందున్న అమేజాన్‌లో 10లక్షల 37వేల మంది ఉద్యోగులున్నారు. అయితే అమెరికాలో వున్న ఫుడ్ సేల్స్ విభాగంలోని ఉద్యోగులకు కరోనా సోకింది. 
 
అమేజాన్ ఉద్యోగులకు కరోనా సోకిందనే విషయం ప్రారంభ దశలోనే తెలుసుకుని, ఇతర ఉద్యోగులకు విషయం చేరవేశామని అమేజాన్ తెలిపింది. కానీ ప్రపంచ దేశాల్లో అమెరికాలోనే అత్యధిక శాతం కరోనా వైరస్ కేసుల సంఖ్య వుండటంతో.. అమేజాన్ ఉద్యోగులను కోవిడ్ సోకింది. ఈ క్రమంలో దాదాపు 20వేల మందికి కరోనా సోకిందని అమేజాన్ స్పష్టం చేసింది. ఆరు నెలల వ్యవధిలోనే కరోనా 20వేల మంది ఉద్యోగులను కాటేసిందని అమేజాన్ తెలిపింది.