గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (11:51 IST)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : సంపూర్ణ ఆధిక్యం దిశగా డీఎంకే

తమిళనాడులో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో ఆపార్టీ నేతలే ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు  చేరుకున్నారు. పదేళ్ళ తర్వాత పార్టీ తిరిగి అధికారాన్ని అందుకోబోతున్నామన్న ఆనందంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
 
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకుగాను ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 234 స్థానాల్లో అధికార అన్నాడీఎంకే 84, పీఎంకే 7, బీజేపీ 5, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, డీఎంకే 113 చోట్ల, కాంగ్రెస్ 12 స్థానాల్లో ఎండీఎంకే 3, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఇతరుల రెండేసి చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఈ ట్రెండ్స్‌ను బట్టిచూస్తే డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోయింది. అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే, డీఎంకే సంపూర్ణ మెజార్టీ సాధించినప్పటికీ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే.. పలు పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పాటై ఎన్నికల్లో పోటీ చేశాయి.