బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (08:39 IST)

తడికెల దొడ్డిలో మహిళ స్నానం చేస్తుంటే తొంగిచూసిన గవర్నర్...

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అతి చేశారు. ఆనక నాలుక్కరుచుకున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్న విషయం తెల్సిందే.

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అతి చేశారు. ఆనక నాలుక్కరుచుకున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్న విషయం తెల్సిందే. కేంద్రంలోని బీజేపీ పాలకుల అండతో ఆయన చెలరేగిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పర్యటించిన గవర్నర్ తాజాగా కడలూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన వ్యవహరించిన తీరుతో అభాసుపాలయ్యారు. 
 
కడలూరు జిల్లాలో అధికారిక సమీక్షల కోసం శుక్రవారం బయలుదేరిన గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు వండిపాళెయం వద్ద రోడ్డు పక్కనే ఓ కాలనీ కనిపించింది. ఆ కాలనీని తనిఖీ చేయాలనుకున్న గవర్నర్‌ తన వాహనాన్ని ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించారు. గవర్నర్‌ వాహనం ఎందుకు ఆగిందో పోలీసులు తెలుసుకునేలోగానే వాహనం దిగిన భన్వరీలాల్‌.. హూటాహూటీన కాలనీలోని ఓ మరుగుదొడ్డి వద్దకు వెళ్లారు. ఆ మరుగుదొడ్డి పక్కనే మరో తడికెల దొడ్డి ఉండటంతో అటువైపు తొంగి చూశారు. ఆ తడికెల దొడ్డిలో ఓ మహిళ స్నానం చేస్తున్న మహిళ కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
దీన్ని గమనించిన ఆ మహిళ... ఎవరో వృద్ధుడు వచ్చాటూ కేకలేస్తూ తడికెపైనున్న చీరను గబగబా శరీరానికి చుట్టుకుని ఇంట్లోకి పారిపోయింది. అసలు విషయాన్ని గ్రహించిన గవర్నర్‌ సిబ్బంది.. అక్కడున్న పోలీసులపై చిందులేశారు. దీంతో పోలీసులు కూడా వారితో వాగ్వివాదానికి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడపడితే అక్కడ వాహనం ఆపి తనిఖీ చేస్తే తామేం చేయగలమని వారు నిలదీయడంతో రాజ్‌భవన్‌ సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. 
 
అయితే గవర్నర్‌ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మరో ప్రాంతానికి వెళ్లి చీపురు పట్టుకుని స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ లోపే మీడియా ఆ వ్యవహారాన్ని బయటపెట్టడంతో కక్కాలేక మింగాలేక అన్నట్లుగా తయారైంది రాజ్‌భవన్‌ పరిస్థితి. ఈ వ్యవహారంపై మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. విమర్శలు వెల్లువెత్తడంతో రాజ్‌భవన్‌ వాటిని ఖండిస్తూ ఒక వివరణ ఇచ్చింది. మీడియాలో వచ్చినట్లుగా అలా ఏమీ జరగలేదని వెల్లడించింది.