బురేవి బీభత్సం.. తమిళనాడులో ఏడుగురు మృతి.. పదిలక్షల ఎక్స్‌గ్రేషియా

cyclone
cyclone
సెల్వి| Last Updated: శనివారం, 5 డిశెంబరు 2020 (21:48 IST)
బురేవి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల ధాటికి తమిళనాడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బురేవి ధాటి తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

ఈ నేపథ్యంలో బురేవి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం పళనిస్వామి అధికారులను ఆదేశించారు. వరదల్లో మృతిచెందిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

రామేశ్వరంలోని తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో తుఫాను పరిస్థితిపై సీఎం పళనిస్వామి సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు 11మంది మంత్రులను నియమించారు.

ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా కడలూరు జిల్లాలో వర్షాలు కురిశాయి. 2వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి, మూగజీవాలు నష్టపోయిన రైతులకు సీఎం పరిహారం ప్రకటించారు. మరోవైపు, సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు.దీనిపై మరింత చదవండి :