గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (17:03 IST)

దాహం వేస్తుందని నిద్రలేపి.. తండ్రిని తాళ్ళతో కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్

బీహార్ రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోయారు. రాత్రిపూట ఇంటికి వచ్చిన కొందరు కామాంధులు.. దాహం వేస్తుందని ఓ ఇంటి తలుపు తట్టారు. దీంతో ఓ యువతి వచ్చి తలుపులు తీయగా, ఆ యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని తండ్రిని తాళ్ళతో కట్టేసి ఆయన కళ్లెదుటే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా కొదోవాడి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఆరుగురు యువకులు మద్యం సేవించి.. రాత్రి పూట ఓ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీసిన ఆ ఇంటి యువతి (19)ని తాగేందుకు నీళ్లు కావాలని అడిగారు. ఆ వెంటనే బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెను బయటకు బలవంతంగా లాక్కొచ్చారు. 
 
అక్కడ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ల అత్యాచారం అత్యాచారం జరిపారు. తమ కుమార్తెను వదిలిపెట్టాలని ఆ కన్నతండ్రి ప్రాధేయపడినా ఆ కామాంధులు కనికరించలేదు. పైగా, అతన్ని తాళ్ళతో కట్టేసి ఆయన కళ్లెందుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించారు. తక్షణం కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.