ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 మార్చి 2021 (16:52 IST)

దేవాలయాల రాష్ట్రంలో ఆలయాలకు దీన స్థితి, భక్తులకు వదిలేయండి: సద్గురు అభ్యర్థన

దేవాలయాల రాష్ట్రం అనే పేరు చెప్పగానే వెంటనే తమిళనాడు రాష్ట్రం గుర్తుకు వస్తుంది. ఇక్కడ వున్నన్ని దేవాలయాలు మరే రాష్ట్రంలోనూ లేవని అంటుంటారు. ఇలాంటి దేవాలయాల పరిస్థితి దీనంగా మారిందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తం చేసారు.
11,999 దేవాలయాలు ఒక్క పూజ కూడా జరగకుండా క్షీణ దశకు చేరుకున్నాయన్నారు. సంవత్సరానికి 10,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో సాగుతున్నవి 34,000. కాగా 37,000 దేవాలయాలలో పూజ, నిర్వహణ, భద్రత మొదలైన వాటికి కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారని చెప్పారు.
 
ప్రభుత్వం ఇలాగే చేతులెత్తేస్తే దేవాలయాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే ఆలయాలను భక్తులకు వదిలివేయండి అంటూ #FreeTNTemples అని ట్యాగ్ చేసారు.