సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (12:08 IST)

పూంచ్ ఉగ్రదాడిలో జవాన్లపై 36 రౌండ్ల కాల్పులు

poonch
poonch
పూంచ్ జిల్లాలోని  ఉగ్రదాడి ఘటనలో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పూంచ్ జిల్లాలోని గాలి నుంచి సంగియోట్ వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు స్టిక్కీ బాంబులను ఉపయోగించిట్లు భద్రతా దళాలు శనివారం వెల్లడించాయి. 
 
ఈ బాంబులను వాహనాలకు జోడించి రిమోట్ లేదా టైమర్ ద్వారా పేల్చవచ్చు. బాంబులతో పాటు జవాన్లపైకి ఉగ్రవాదులు సమీపం నుంచి 36 రౌండ్ల కాల్పులు జరిపినట్టు గుర్తించారు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా సహాయంతో ఉగ్రవాదులు దాడి చేశారని నిఘా వర్గాలు తెలిపాయి.