మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (13:57 IST)

పెళ్లి చేసుకుంటానుగా అంటూ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, ఆపై బెడ్రూంలో ఫోటోలు తీసి...

నాగ్‌పూర్ జిల్లాలో ఆదాయపు పన్ను కమిషనర్‌పై అత్యాచారం కేసును  పోలీసులు నమోదు చేసారు. మహిళా వైద్యురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడని, ఆమెకు బలవంతంగా గర్భస్రావం కూడా చేశాడని తెలిపారు.
 
35 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి పుదుచ్చేరి నివాసి. నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలితో నిందితుడు సంప్రదించాడు. అతను 201 లో నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (ఎన్ఎడిటి)లో శిక్షణ కోసం నగరంలో ఉంటూ వచ్చాడు.
 
ఈ క్రమంలో అనారోగ్యానికి చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లినప్పుడు నిందితుడు బాధితురాలితో స్నేహం చేశాడు. యుపిఎస్‌సి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు బాధితురాలికి చెప్పడంతో నిందితుడు తన మొబైల్ ఫోన్ నంబర్ ఇచ్చాడని ఎఫ్‌ఐఆర్‌ను ఉటంకిస్తూ అధికారి తెలిపారు. 
 
తరువాత, నిందితుడు ఆమెను వివాహం చేసుకోవాలనే నెపంతో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అతను ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడని, ఆమె అశ్లీల ఫోటోలను కూడా తీసి బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపారు. ఆ మహిళ గర్భవతి అయినప్పుడు, ఆమెను గర్భస్రావం చేయమని ఒత్తిడి తెచ్చాడు.

ఆమె పెళ్లి కోసం పట్టుబట్టడంతో బాధితురాలితో బెడ్రూంలో గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని నిందితుడు బెదిరించాడని అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (2) కింద అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. నిందితుడిని బెంగళూరులో పోస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అతడిని ఇంకా అరెస్టు చేయలేదనీ, కేసు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.