గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (20:11 IST)

ఢిల్లీలో ముగిసిన ఎన్నికల పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కే పట్టం..

ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పునిచ్చేశాడు. కానీ ఎవరికి పట్టం కట్టారనే విషయం తెలుసుకోవాలంటే.. ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆప్, బీజేపీ మధ్య ప్రదాన పోటీ నెలకొంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వివరాలు వచ్చేశాయి. ఈ పోల్స్‌లో ఆప్ 53-57, బీజేపీ 11-17, కాంగ్రెస్ 0-2 స్థానాలు దక్కాయి. తిరిగి ఆప్‌కే ఓటర్లు పట్టం కట్టారు. 
 
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు 57.9 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సంస్థలు ఆప్‌కి పట్టం కట్టాయి. సుమారు 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. బీజేపీ కేవలం 20 నుంచి 30 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. 
 
మరోసారి ఢిల్లీ పీఠం ఆప్ వశమయ్యే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలు గవర్ననెన్స్, అభివృద్ధికి ఓటు వేశారని తెలిపారు. కాంగ్రెస్ ఓటు ఇక్కడ పతనమైందని రాజకీయ పండితులు అంటున్నారు.