మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (10:58 IST)

జమ్మూలో ఎదురుకాల్పులు-ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కాశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను ఆర్మీ బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. ఇందులో ఒక‌రిని ముఖ్త‌ర్ షాగా పోలీసులు గుర్తించారు. 
 
ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమ‌వారం ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఐదుగురు జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పూంచ్ సెక్టార్‌లో బ‌ల‌గాల సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.